Trump: ఇరాన్‌పై ట్రంప్ బిగ్గెస్ట్ వార్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌లో పెను విధ్వంసానికి రంగం సిద్ధం!
Trump: పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధంపై ప్రపంచ దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. అంతర్జాతీయ వర్గాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు మొదలయ్యాయి. నెలల తరబడి సాగుతున్న పోరులో దౌత్యపరమైన ఒత్తిళ్లకు ఇరాన్ ఏమాత్రం తలొగ్గకపోవడంతో, ఆ దేశాన్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సంప్రదాయ ఆయుధాల్లోనే అత్యంత భయంకరమైన అస్త్రంగా పిలిచే 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' (MOAB)ను ఇరాన్‌పైకి ప్రయోగించేందుకు అమెరికా సైనిక వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయని, దీనికి ట్రంప్ నుంచి కూడా అనుమతి లభించినట్లు ప్రచారం జరుగుతోంది.ఇరాన్ అణు కేంద్రాలు ఉన్న పీక్యార్ట్స్ పర్వత ప్రాంతంతో పాటు, ఆ దేశ కీలక ఇంధన, విద్యుత్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు ముందు లేదా ఆ తర్వాత ఈ మెగా దాడిని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
