National
Donald Trump: ‘ఎనర్జీ సీజ్ఫైర్’.. ట్రంప్ సంచలన ప్రకటన!
Donald Trump: రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య తక్షణమే ‘ఎనర్జీ సీజ్ఫైర్’ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, గ్యాస్ పైప్లైన్ల వంటి కీలక ఇంధన మౌలిక వనరులపై పరస్పర దాడులను ఆపేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన వెల్లడించారు.
