ఏపీ

ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తేస్తారా? అభిప్రాయం చెప్పే హక్కులేదా? : నటి చాందిని

ఏపీలో జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై ప్రశ్నించిన సినిమా యాక్టర్ చాందిని చౌదరిపై ట్రోల్స్ మొదలవ్వడంపై ఆమె మరోసారి స్పందించారు. ‘ప్రశ్నిస్తే బ్లేమ్ చేస్తారా..? అభిప్రాయం చెప్పే హక్కు లేదా?’ అంటూ ఫైర్ అయ్యారు. గత కొంతకాలంగా విశాఖలో కొండల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై స్పందించిన ఆమె ప్రకృతిని నాశనం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొండల్ని ధ్వంసం చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది’అంటూ ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా హీరోయిన్ చాందిని చౌదరీ పోస్టు పెట్టారు.అభివృద్ధి, అర్బనైజేషన్ పేరిట విశాఖపట్నం పరిసరాల్లోని కొండల్ని ఏపీలోని కూటమి సర్కార్ ధ్వంసం చేస్తున్నదని పరోక్షంగా స్పందించారు. ఈ దృశ్యాలు చూస్తుంటే గుండె బరువెక్కుతోందని, ప్రకృతి అందాలు నాశనమవుతుంటే తన మనసు కలత చెందుతోందంటూ చాందిని చౌదరీ వాపోయారు.