తెలంగాణ

నీకు జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డి.. నేతన్నలను మోసం చేశావ్ : జీవన్ రెడ్డి

సిరిసిల్ల సభలో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలు, ఉపయోగించిన పదజాలంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్మమంత్రి సభకు జనాలను తీసుకొచ్చేందుకు కిందిస్థాయి జిల్లా నేతలు తీవ్రఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. గురువారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల మీదల తీవ్ర విమర్శలు గుప్పించారు.సిరిసిల్ల సభకు 10, 15 జిల్లాల నుంచి జనాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతుల అంశం, నీళ్ల అంశం మాట్లాడుతారని అనుకున్నామని.. కానీ, ఆయనకు రాజకీయాలే ప్రాధాన్యత అని తెలిసిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌పై కడుపులో విషం నింపుకొని మాట్లాడినట్టు అర్ధం అవుతోందని అన్నారు.ముఖ్యమంత్రి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.