ఏపీ

గుడిలో దీపం కోసం ఇళ్లల్లోని దీపాలు ఆర్పుతారా? : ఎమ్మెల్సీ త్రిమూర్తులు

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో అర్ధరాత్రి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వచ్చే ఏడాది ప్రారంభంలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది.దీంతో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా కొన్ని ఇండ్లను కూల్చాల్సి వస్తున్నది.ఈ క్రమంలోనే అధికారులు అర్ధరాత్రి ఇండ్లను కూల్చేందుకు పోలీసుల సాయంతో ఘటనా స్థలానికి వెళ్లగా ప్రజలు, అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏన్నో ఏండ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, పుష్కరాల కోసం తమ ఇండ్లను తొలగించడం ఏంటని అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారి సమస్యలు విన్నారు. ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. అనంతరం అధికారులతో మాట్లాడినట్టు తెలిసింది.