National
విదేశాల్లో వివాహాలు, పర్యటనలకు వెళ్లకండి : ప్రధాని మోడీ
భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ మరోసారి వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశప్రజలకు కీలక సందేశం పంపారు. మంగళవారం ఉదయం సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2026-2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశం 7.8 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేయడంపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం భారతీయుల సంకల్పం, కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘనత మన సమిష్టి బలాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ జీడీపీ పెరుగుదల దేశ అభివృద్ధిని సూచిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రజలు స్వదేశీ మంత్రంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో వివాహాలు చేసుకోవద్దని, విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని సూచించారు.
