ఒక్క ఇంచు కొన్నా వదిలిపెట్టం.. వెనక్కి తీసుకుంటాం-పారిశ్రామికవేత్తలకు కేటీఆర్ వార్నింగ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరు, సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో అమ్ముకోవడమే తప్పా రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని పరోక్షంగా సెటైర్లు వేశారు. బుధవారం ఉదయం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, మరికొంతమంది నేతలు కారు ఎక్కగా.. వారికి గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘అడవులు నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది’ అంటూ ఎద్దేవాచేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను అమ్ముతున్నారని గుర్తుచేశారు.
