సినిమా
‘ప్రైవసీని దెబ్బతీయొద్దు..’ ప్రైవేట్ వీడియో లీక్‌పై సురేఖ వాణి స్పందన!
టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడితో సురేఖ వాణి అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వీడియోపై సురేఖ వాణి స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతా హ్యాకింగ్‌కు గురైందని తెలుపుతూ ఆందోళన వ్యక్తం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి, తనకు సంబంధించిన వ్యక్తిగత, ప్రైవేట్ వీడియోలను, కంటెంట్‌ను సోషల్ మీడియా వేదికల్లోకి లీక్ చేసి ప్రచారం చేస్తున్నారని వాపోయింది.
