తెలంగాణ

సింగరేణి ప్రయివేటీకరణపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ!

రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సింగరేణి సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు మంత్రి శ్రీధర్ బాబు తాజాగా కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు.సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టంచేశారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు. గత పదేళ్ల పాలనలో సింగరేణిని కేసీఆర్ కుటుంబం ఒక 'జేబు సంస్థ'గా మార్చుకుందని విమర్శించారు.