National
Diwali Gold Shopping: ఇండియాలో బంగారం పిచ్చి మామూలుగా లేదుగా.. దీపావళికి ఎన్ని టన్నుల పసిడి కొన్నారంటే?
Diwali Gold Shopping: భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది తరతరాల సెంటిమెంట్, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తి. పండుగ వచ్చిందంటే చాలు.. కొత్త బట్టలు, పిండివంటల సందడితో పాటు ప్రతి ఇంటా వినిపించే మరో ప్రధాన మాట 'పసిడి'. తాజాగా ముగిసిన దీపావళి, ధంతేరాస్ వేడుకల్లో మనవాళ్ల బంగారం క్రేజ్ మరోసారి రికార్డులను తిరగరాసింది. దేశవ్యాప్తంగా జనం ఏకంగా 52 టన్నుల (అంటే 52,000 కిలోలు) బంగారాన్ని కొనుగోలు చేశారంటే, ఇండియాలో పసిడి మోజు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే సుమారు రూ. 72 వేల కోట్ల విలువైన వ్యాపారం జరగడం మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.
