పీడీఎస్ రైస్ పక్కదారి.. ఒకేసారి 150 మంది రైస్ మిల్లర్ల అరెస్టు!
రాష్ట్రంలో పీడీఎస్ రైస్ పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం కొరఢా ఝలిపించింది.కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరాలో భారీ అక్రమాలు జరిగాయని అధికారులు విచారణలో తేల్చడడంతో రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగారు. ఇప్పటివరకు దాదాపు 150 మందికిపైగా రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.ఆదివారం ఉదయం 5 గంటల నుంచే సీఐడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అలాగే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నలుగురు రైస్ మిల్లు యజమానులను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.
