ఏపీ

మద్యం షాపుల రెన్యూవల్ ఫీజు వివాదం.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు!

 ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపుల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) రుసుముపై నెలకొన్న వివాదంపై ఏపీ హైకోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నోటిఫై చేసిన ఫీజును చెల్లించి, నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని మద్యం దుకాణ యజమానులను ఆదేశించింది. సెప్టెంబర్ 21వ తేదీతో రెన్యూవల్ దరఖాస్తుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది.