తెలంగాణ
ఆర్టీసీలో డిజిటల్ విప్లవం.. నాన్‌స్టాప్ బస్సుల్లో క్యూఆర్ కోడ్‌తో ‘సెల్ఫ్ టికెటింగ్’!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC / TSRTC) ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు వినూత్న డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. నాన్‌స్టాప్ బస్సు సర్వీసుల్లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా ‘సెల్ఫ్ టికెటింగ్’ (Self-Ticketing) వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. బస్సు ఎక్కే సమయంలో టికెట్ కోసం వేచి చూడకుండా, ప్రయాణికులే స్వయంగా తమ ఫోన్ ద్వారా స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేసే వెసులుబాటును ఈ విధానం కల్పిస్తుంది.
