రాజకీయాలు
క్షుద్రపూజలు చేసే రేవంత్ సీఎం అయ్యాడా? : ఎమ్మెల్యే సంజయ్
రాష్ట్రంలో కరువు కాటకాలు సంభవించాలని, వర్షాలు పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్ మాజీ మంత్రి, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కర్ణాటక వెళ్లి చేతబడులు, క్షుద్రపూజలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించగా.. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి అయ్యేందుకు రేవంత్ రెడ్డి సైతం చేతబడులు, క్షుద్ర పూజలు చేశారా? అని ప్రశ్నించారు.
