రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకల ఖర్చు రూ.150 కోట్లు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు రూ.150 కోట్ల ఖర్చు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్యాక్సులు కట్టే జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అల్లాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని తన స్వార్థం కోసం వినియోగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో ఒక పక్క కరెంట్, నీళ్లు లేక రైతులు, ప్రజలు అల్లాడుతుంటే.. మరోవైపు పుట్టినరోజు సంబురాల్లో రేవంత్ సర్కార్ మునిగి తేలుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సొమ్ముతో భారీగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రచారాలు చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నవంబర్ 8 (దీపావళి పండుగ)నాడు తన పుట్టినరోజు వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో జరుపుకోనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులు మంత్రులు, అధికారులందరూ కొడంగల్లోనే ఉండేలా ముఖ్యమంత్రి ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది.
