తెలంగాణ
Dial 112: ఇక నుంచి డయల్ 100 కాదు డయల్ 112.. కొత్త ఎమర్జెన్సీ నెంబర్.. ప్రతి ఒక్కరూ సేవ్ చేసుకోండి
Dial 112: తెలంగాణలో అత్యవసర సేవలకు కొత్త నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు డయల్ 100 కు కాల్ చేసే వాళ్లు. ఇక నుంచి డయల్ 100 స్థానంలో ఒకే ఒక్క ఎమర్జన్సీ నెంబర్ డయల్ 112 ను అందుబాటులోకి తెచ్చారు. డయల్ 112 సేవలను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఇకపై పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక వంటి అన్ని అత్యవసర సేవలకు కోసం డయల్ 112ను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. ప్రజలంతా ఈ నెంబర్ ను సేవ్ చేసుకోవాలన్నారు. ఇకపై ఒకేసారి 960 కాల్స్ తీసుకునేలా సిస్టమ్ ను అప్ డేట్ చేశారు.
