తెలంగాణ
Dharmapuri: ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట.. రూ.10 కోట్లతో ఉగ్ర నరసింహ ఆలయ పునర్నిర్మాణం!..
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధికి అడుగులు పడ్డాయి.. నేటి సోమవారం వేకువజామున 2:58 గంటలకు వేద పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో రూ. 10 కోట్లతో చేపట్టిన శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉగ్ర నరసింహస్వామి ఆలయానికి పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విస్తరించడం జరుగుతుందని మరో వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలయ అభివృధి చేస్తున్నామని డిప్యూటీ సీఎం అన్నారు.
