తెలంగాణ
DGP CV Anand: మావోయిస్టు స్థావరం నుంచి పర్యాటక కేంద్రంగా కర్రెగుట్ట- డీజీపీ సీవీ ఆనంద్
ఒకప్పుడు మావోయిస్టుల కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న తెలంగాణ-ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని కర్రెగుట్టలో 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు శాంతి నెలకొందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా డెవలప్ చేస్తామన్నారు. కర్రెగుట్టలో అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. సోమవారం ములుగు జిల్లా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, శాంతికి ప్రతీకగా పావురాలను ఎగురవేశారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
