అభిప్రాయం
మహిళా భద్రతకు ''భరోసా కేంద్రం'' అండ..
మహిళలు, బాలికల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో సైబరాబాద్‌లో నూతనంగా నిర్మించిన భరోసా కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రం పూర్తి కావడానికి ఏడేళ్ల సమయం పట్టిందని, ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత కేంద్రం ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు డీజీపీ సీవీ ఆనంద్. లైంగిక దాడులు, ఇతర నేరాల్లో బాధితులకు వైద్య పరీక్షలు, మానసిక కౌన్సెలింగ్, న్యాయపరమైన సహాయం, అవసరమైన సంప్రదింపులను ఒకే వేదికపై అందించడం భరోసా కేంద్రాల ప్రత్యేకత అని వివరించారు.
