క్రైమ్
స్పై కెమెరా కళ్లజోడుతో శ్రీకాళహస్తి ఆలయంలోకి.. పోలీసుల అదుపులో భక్తుడు!
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపేలా ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నిఘా కెమెరాలు అమర్చిన ప్రత్యేక 'స్పై కెమెరా కళ్లజోడు' (Spy Camera Spectacles) ధరించి పుణెకు చెందిన ఓ భక్తుడు నేరుగా ఆలయంలోకి ప్రవేశించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సదరు భక్తుడు ధరించిన కళ్లజోడుపై అనుమానం వచ్చిన పూజారులు వెంటనే అప్రమత్తమై ఎస్పీఎఫ్ (SPF) భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు.
