National
అభివృద్ధి జరగాలి..దేశానికి దూరంగా కాదు : ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పండిట్ ‘దీన్‌దయాళ్’ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశానికి స్వదేశీ భావజాలంతో కూడిన దృక్పథాన్ని అందించిన మహనీయుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అని పేర్కొన్నారు. దీన్‌దయాళ్ 'చరైవేతి, చరైవేతి' (నిరంతరం ముందుకు సాగండి) అనే అభివృద్ధి మంత్రాన్ని బోధించడమే కాకుండా, తన జీవితాంతం ఆచరించి చూపించారని కొనియాడారు. ఆయన నిరంతర సాధకుడని ప్రశంసించారు. భారతదేశాన్ని పాశ్చాత్య లేదా విదేశీ దృక్పథంతో కాకుండా, స్వదేశీ మూలాలతో అర్థం చేసుకుని భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారని.. అందుకే ఆయన అరుదైన నాయకుడు అని గుర్తుచేశారు.
