తెలంగాణ
మెట్రో రైలులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు!
హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆర్టీసీ – మెట్రో కామన్ మొబిలిటీ పాస్' నూతన విధానాన్ని ప్రోత్సహించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేబినెట్ మంత్రులు శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్లు కలిసి సాధారణ ప్రయాణికుల్లా మెట్రో రైలు ఎక్కి ప్రయాణించి కామన్ పాస్ వినియోగాన్ని పరిశీలించారు.
