National
Delimitation: ముచ్చటగా మూడోసారి.. డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కుతుందా?
Delimitation: గతంలో రెండుసార్లు చేజారిన రాజ్యాంగ సవరణ బిల్లును ఈసారి ఎలాగైనా పార్లమెంట్ గడప దాటించాలన్న పట్టుదలతో ఢిల్లీ పీఠం పావులు కదుపుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చట్టం ద్వారా దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా సభలను ఇంకా ప్రోరోగ్ చేయకుండా పెండింగ్లో పెట్టడం, బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ముగిసిన వెంటనే ప్రత్యేక సమావేశాల నిర్వహణకు తెరవెనుక ఏర్పాట్లు సాగుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే రెండుసార్లు చతికిలపడ్డ ఈ ప్రతిష్టాత్మక బిల్లును ముచ్చటగా మూడోసారి అధికార ఎన్డీయే కూటమి ఎలా నెగ్గించుకుంటుందన్నదే ఇప్పుడు అతిపెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న.
