జలదిగ్భంధంలో ఢిల్లీ ప్రధాన రహదారులు
దేశరాజధాని ఢిల్లీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.దీంతో రాజధానిలోని ప్రధాన రహదారులు వరద నీటిలో చిక్కుకున్నాయి. గత రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మెయిర్ రోడ్డులు చెరువులను తలపిస్తున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టు సమాచారం. వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్‌లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తమ గమ్యస్థానాలకు చేరుకోలేక సామాన్యలు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులపై రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజా రవాణా వైపు మళ్లినట్టు సమాచారం.దీంతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు, బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరో 24 గంటల పాటు ఢిల్లీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.
