National
పోలీసుల దిగ్బంధంలో ఢిల్లీ.. జంతర్ మంతర్ వద్ద ఏడు అంచెల భద్రతా వలయం!
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతిపాదించిన భారీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, నిరసనకారులు పెద్ద ఎత్తున జంతర్ మంతర్‌కు తరలివస్తారనే పక్కా సమాచారంతో రాజధానిని ఒక సైనిక కోటగా మార్చేశారు. ఈ భద్రతా ఆంక్షలతో మధ్య ఢిల్లీలో అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది.
