National
Delhi Police: జంతర్‌మంతర్‌లో మహిళా జర్నలిస్టులపై ఏసీపీ లైంగిక వేధింపులు!
Delhi Police: దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్ సాక్షిగా ఢిల్లీ పోలీసులు అత్యంత హేయమైన చర్యకు ఒడిగట్టారు. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు మహిళా జర్నలిస్టులపై ఓ ఉన్నతస్థాయి పోలీస్ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు చేపట్టిన నిరసనల లైవ్ కవరేజ్ టైంలో ఈ అరాచకం చోటుచేసుకుంది. యూనిఫాంలో ఉన్న ఏసీపీ స్థాయి అధికారే అంత బహిరంగంగా మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడం మీడియా వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.
