National
Delhi: కూలిన PG హోస్టల్.. శిథిలాల కింద చిక్కుకున్న 50 మంది విద్యార్థులు!..
దేశ రాజధాని దిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్య నికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఓ బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌కు ప్రాక్సీమల్గా ఉండే ఈ భవనాన్ని విద్యార్థుల కోసం పేయింగ్ గెస్ట్ వసతి గృహంగా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఆదివారం కావడంతో ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. విరామం తీసుకుంటున్న సమయంలో ఉన్నపళంగా భవనం కూలిపోవడంతో.. వారంతా శిథిలాల కిందే చిక్కుకుపోయారనే ఆందోళన వ్యక్తం అవుతుంది..
