National
పశ్చిమాసియా సెగ.. సామాన్యుడిపై మరో భారం!..
దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులపై మరోసారి ఇంధన భారం పడింది. ఢిల్లీ, దాని పరిసర నగరాల్లో CNG (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధర కిలోకు రూ.3.89 చొప్పున పెరిగింది. సీఎన్‍జీ ధర పెరగబోతోందని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) శుక్రవారం రాత్రి ప్రకటించగా పెరిగిన ధర ఇవాళ (శనివారం) ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.
