National

ఢిల్లీలో కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలు!!..

దేశ రాజధాని ఢిల్లీ లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి (Seemapuri) ప్రాంతంలో ఐదు అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న అధికారులు వెంటనే 4 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను తరలించేందుకు వీలుగా రాజీవ్ గాంధీ ఆసుపత్రి (Rajiv Gandhi Hospital) సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు.