వైరల్ న్యూస్

‘ఇన్నర్ వేర్’ డెలివరీ ఆలస్యం.. ఇంట్లో బంధించి టార్చర్!

ఓ ఆర్డర్ డెలివరీ ఆలస్యం అయ్యిందని ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. బాయ్‌ను ఇంట్లో బంధించి టార్చర్ చేశాడు. ఈ ఘటన యూపీలో మీరట్‌లో చోటుచేసుకోగా.. తోటి గిగ్ వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రోడ్డెక్కారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయడంతో పాటు క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.వివరాల్లోకివెళితే.. నిన్న రాత్రి 9 గంటల సమయంలో.. యమన్(34) అనే వ్యక్తి అండర్‌వేర్, చిప్స్ ప్యాకెట్‌ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. స్టోర్ వాళ్లు అండర్‌వేర్ తీసుకురావడంలో ఆలస్యం చేయడంతో.. డెలివరీ బాయ్ అమిత్‌ 5 నిమిషాలు ఆలస్యంగా ఆర్డర్ డెలివర్ చేశాడు.దాంతో 5 నిమిషాలు ఆలస్యం ఎందుకు అయ్యిందంటూ అమిత్‌పై యమన్ చెయ్యి చేసుకున్నాడు. ఆపై అతడ్ని ఇంట్లోకి తీసుకెళ్లి.. కొద్దిసేపు బంధించి.. దుర్భాషలాడుతూ దాడి చేశాడని బాధితుడు పేర్కొన్నాడు.