తెలంగాణ

చేతిలో డిగ్రీ పట్టాలు..జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. శనివారం కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. ఉదయం నుంచే అభ్యర్థులు భారీగా తరలి రావడంతో కాన్వెంట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులు ముందుగా పేర్లను నమోదు చేసుకుని, అర్హతలకు అనుగుణంగా కేటాయించిన స్టాల్స్‌ వద్దకు చేరుకున్నట్టు సమాచారం.స్టాల్స్‌ వద్ద అభ్యర్థులు క్యూ లైన్లలో నిలబడి వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూలు, ఇతర ఎంపిక ప్రక్రియల్లో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో యువత నుంచి భారీ స్పందన కనిపించింది. జాబ్‌మేళాకు పెద్దఎత్తున అభ్యర్థులు తరలిరావడంతో నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.