తెలంగాణ

Deepavali Puja Vidhanam: దీపావళి రోజు ఎప్పుడు దీపాలు వెలిగించాలి? పూజ ఇలా చేస్తేనే అసలైన ఫలితం!

Deepavali Puja Vidhanam: దీపావళి వచ్చిందంటే చాలు.. ఇల్లంతా పండుగ కళ వచ్చేస్తుంది. అయితే ఈసారి నరక చతుర్దశి, దీపావళి అమావాస్య రెండూ ఒకే రోజు రావడంతో.. అసలు దీపాలు ఎప్పుడు వెలిగించాలి? పూజ ఏ టైంలో ఎలా చేస్తే మంచిది? అనే సందేహం చాలామందిలో ఉంది. దీపావళి నాడు దీపాలు పెట్టడానికి ఒక పద్ధతి ఉంది. సరైన సమయంలో, సరైన రీతిలో దీపాలు వెలిగించి పూజ చేసుకుంటేనే ఆ లక్ష్మీదేవి కటాక్షం మన ఇంట్లో నిలుస్తుంది.దీపావళి రోజు దీపాలు పెట్టడానికి బెస్ట్ టైమ్ సాయంత్రం సంధ్యా సమయం. అంటే సూర్యుడు అస్తమించి చీకటి పడే వేళ. సరిగ్గా ఆ సమయంలోనే లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందని చెబుతారు. సాయంత్రం దీపాలు పెట్టే ముందు ఇంటి వెనుక వైపు తలుపులు మూసి ఉంచి, ముందు గుమ్మాలు వెడల్పుగా తెరిచి ఉంచాలి. ప్లాస్టిక్, పింగాణీ లాంటివి కాకుండా శుభ్రమైన మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించాలి.