క్రైమ్

సిద్దిపేటలో తీవ్ర విషాదం..ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం

రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొన్నది.ఎవరూ ఊహించని విధంగా ప్రమాదవశాత్తు ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకోగా.. ఒక్కసారిగా జిల్లా ప్రజలు షాక్‌కు గురైనట్టు తెలుస్తోంది.కుటుంబం ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు బావిలోకి దూసుకెళ్లినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో అందులోని వారంతా మరణించినట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే.. సిద్ధిపేట దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కొడుకు నిహాన్ష్ (4), కూతురు శాన్విక (2)తో కలిసి కారులో సిద్దిపేట నుంచి ఇంటికి వెళ్తున్నారు.అయితే, మార్గంమధ్యలో అప్పనపల్లి శివారులో ప్రమాదవశాత్తు కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లినట్టు సమాచారం.ఈ ప్రమాదంలో కుటుంబంలోని వారంతా మృతి చెందినట్టు తెలిసింది.