క్రైమ్
ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురిని బలిగొన్న అతివేగం
ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ముగ్గురు యువకులు అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అయితే, రైడర్ వాహనాన్ని వేగంగా నడపటంతో అదుపుతప్పి రవవాండ్లపల్లి వద్ద చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం అనంతరం బైక్‌లో మంటలు చెలరేగినట్టు సమాచారం.మంటల్లో ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోగా.. మృతులు అనిల్, దీక్షిత్, అర్జున్‌గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
