క్రైమ్

నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ టూర్‌లో తీవ్ర విషాదం

సాగర్ బ్యాక్ వాటర్‌లో విహారం కోసం వచ్చిన ఓ పర్యాటకుడు గల్లంతైనట్టు సమాచారం. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో టూరిజంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. వైజాగ్ కాలనీలోని నాగార్జున సాగర్ బ్యాక్‌ వాటర్‌లో విహారం కోసం ఓ మిత్రబృందం వెళ్లింది. ఈ క్రమంలోనే అందులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో ఓ యువకుడు మునిగిపోయాడు. సదరు యువకుడి ఆచూకీ కోసం దాదాపు రెండు గంటల పాటు రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు యువకుడి బాడీని గుర్తించాయి. మరణించిన వ్యక్తిని దుర్గం తిరుమలేష్‌గా గుర్తించారు.