గణేశ్ నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం.. ఎస్ఐ మృతి
రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణపతి నిమజ్జనాల ఉత్సవాల్లో భాగంగా విధులు నిర్వహించేందుకు హైదరాబాద్కు వచ్చిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కింద పడిపోవడంతో సహచర ఉద్యోగి ఆయన్ను పైకి లేపారు. గాయాలపాలైన కొత్తగూడెం టూ టౌన్ ఎస్సై కె.వెంకన్న (55)ను హాస్పిటల్కు తరలించారు. చికిత్స అనంతరం ఆయన క్షేమంగా కొత్తగూడంలోని తన ఇంటికి వెళ్లిపోయారు.మంగళవారం రాత్రి సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు సమాచారం. మరో పోలీస్ అధికారితో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం వాహనం ఆపకుండానే పారిపోయారు.ఈ ఘటనలో ఆయన కుడి కాలికి స్వల్ప గాయాలయ్యాయి.చికిత్స తీసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్లినప్పటికీ ఒంటినొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 5.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
