తెలంగాణ

Deccan Kitchen Case: దగ్గుబాటి బ్రదర్స్‌కు చుక్కెదురు.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

హైదరాబాద్‌లోని ప్రముఖ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో సినీ ప్రముఖులు, దగ్గుబాటి సోదరులకు తెలంగాణ ఉన్నత నాయస్థానంలో తీవ్ర చుక్కెదురైంది. తమపై నమోదైన పోలీసు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ (క్వాష్) దగ్గుబాటి కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, దానిని తోసిపుచ్చుతూ సంచలన తీర్పు వెలువరించింది.