రాజకీయాలు

రేవంత్‌పై కూతురి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాసేపట్లో విచారణకు కొండా సురేఖ!

అధికార కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగడిపడుతూనే ఉన్నాయి. మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వంటి వారు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ధిక్కార స్వరం వినిపించిన విషయం తెలిసిందే.తాజాగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని మినిస్టర్ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత నిన్ని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే,కొండా సుస్మిత వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొండా సుస్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మంత్రి సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చినట్టు సమాచారం.వాటిని మంత్రి కూడా అందుకున్నట్టు తెలిసింది. గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించే పీసీసీ క్రమశిక్షణా కమిటీ భేటీకి ఆమె హాజరై తనకూతురు చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.