తెలంగాణ

TG: మహాదేవుడి పేరిట రేవంత్ సర్కార్‌ మహా దోపిడీ: దాసోజు శ్రావణ్

TG: ఒక్క అడుగు తవ్వలేదు.. ఒక్క ఇటుక పేర్చలేదు.. కానీ మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ అంచనా వ్యయం మాత్రం అమాంతం ఆకాశాన్ని తాకిందంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శంకుస్థాపన దశలోనే ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేయడం వెనుక రూ.250 కోట్ల గోల్‌మాల్ దాగుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పనులు మొదలుకాకముందే అంచనాలు పెంచడం వెనుక ఉన్న మతలబేంటని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెక్కలను బయటపెడుతూ దాసోజు శ్రావణ్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ ప్రాజెక్టును మొదట దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టాలని భావించారని, కానీ అధికారికంగా జీవో వెలువడేసరికి లెక్కలు పూర్తిగా మార్చేశారని ఆయన మండిపడ్డారు.