తెలంగాణ
దసరా ఎఫెక్ట్.. 4కి.మీల మేర రద్దీగా హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే!
తెలుగువారి పెద్ద పండుగైన దసరా, బతుకమ్మ సంబరాల నేపథ్యంలో రాజధాని హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది ప్రజలు పల్లెబాట పట్టడంతో జాతీయ రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. శని, ఆదివారాలు వరస సెలవులు కావడంతో సొంతూర్లకు వెళ్లే వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో అత్యంత కీలకమైన హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై (NH-65) రద్దీ తీవ్రరూపం దాల్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ టౌన్ వరకు దాదాపు 4కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
