తెలంగాణ

దసరా ఎఫెక్ట్.. నాన్‌‌వెజ్ ప్రియులకు షాక్

దసరా పండుగ సందర్బంగా నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మాంసం ధరలు కొండెక్కినట్టు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌ లెస్ చికెన్ ధర రూ.300 నుంచి రూ. 320 వరకు పలుకుతున్నట్టు తెలిసింది. వరంగల్, కామారెడ్డి వంటి జిల్లాల్లో రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సహా ప్రధాన నగరాల్లోనూ కిలో చికెన్ ధర దాదాపు రూ.280 నుంచి రూ.300 మధ్యలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మటన్ ధరలు కూడా స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. మేక, పొట్టేలును బట్టి కిలోకు రూ. 700 నుంచి రూ. 1,100 వరకు విక్రయిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా డిమాండ్ అధికంగా ఉన్నట్టు విక్రయదారులు చెబుతున్నారు.