Spirituality

ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ దర్శనం!

 విజయవాడలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజూ ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో తొలిరోజైన నేడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దివ్యమంగళ రూపంలో అభయమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.