క్రైమ్

గణేశ్ నిమజ్జనంలో కొండచిలువతో డ్యాన్స్.. రంగంలోకి పోలీసులు!

 హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఓ డ్యాన్స్ గ్రూప్ చేసిన విన్యాసం తీవ్ర వివాదాస్పదమైంది. విశాఖపట్నానికి చెందిన ఒక డ్యాన్స్ బృందం నిమజ్జన వేడుకల్లో భాగంగా ప్రదర్శన ఇచ్చింది. అయితే, తమ పెర్ఫార్మెన్స్‌లో ప్రత్యేకత ఉండాలని భావించిన సదరు గ్రూప్‌లోని ఒక యువతి, ప్రాణాపాయాన్ని సైతం లెక్కచేయకుండా నిజమైన కొండచిలువతో డ్యాన్స్ చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది.  మహిళా డ్యాన్సర్ తన మెడలో భారీ ఇండియన్ రాక్ పైథాన్ (కొండచిలువ) వేసుకుని రోడ్డుపై స్టెప్పులు వేసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో పాటు వన్యప్రాణి సంరక్షణ అధికారుల దృష్టికి వెళ్లాయి.