సినిమా

Dance Master Raju : 'ఢీ' ఫేమ్ రాజు అరెస్ట్.. యువతి ఫిర్యాదుతో కటకటాల్లోకి!

Dance Master Raju : బుల్లితెరపై సంచలనం సృష్టించిన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ 10’ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి తనపై లైంగిక దాడికి, వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో సంచలన ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసులో రాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినప్పటికీ.. దాదాపు మూడు రోజుల పాటు పోలీసులు ఈ విషయాన్ని బయటికి తెలియనివ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.డ్యాన్స్ మాస్టర్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న రాజు.. వెండితెరపై అవకాశాలు వెతుక్కుంటున్న ఓ యువతిని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమాల్లో మంచి ఆఫర్లు ఇప్పిస్తానని, ప్రముఖులతో పరిచయాలు చేయిస్తానని నమ్మించి ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనపై సాగిన వేధింపులు భరించలేక చివరికి మియాపూర్ పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు కంప్లైంట్‌లో వెల్లడించింది.