తెలంగాణ
Danasari Seethakka: మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు.. సీఎం రేవంత్ నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం
మహిళా సంఘాలకు రైస్ మిల్లింగ్ బాధ్యతలు అప్పగించాలని సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేలా ఈ నిర్ణయం ఉందంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారామె.
