తెలంగాణ
అనర్హత వేటు.. సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో దానం నాగేందర్!
హైకోర్టు తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్ ఏ విధంగా ముందుకెళ్లనున్నారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో భూపతి రెడ్డి కూడా ఇదే తరహాలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా గత కేసులో మాదిరిగానే తీర్పు రావచ్చని కొందరు న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
