తెలంగాణ
పోరాటం నాకు కొత్త కాదు.. మళ్లీ గెలుస్తా- హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్
Danam Nagender: తనపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ స్పందించారు. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని దానం తెలిపారు. ఉప ఎన్నికకైనా సిద్ధమే అని తేల్చి చెప్పారు. ఖైరతాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నట్లు దానం చెప్పారు. ఎన్నికలు తనకు కొత్తేమీ కాదన్నారు. మళ్లీ పోరాడతా, మళ్లీ గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఏ పార్టీ తరపున బరిలోకి దిగతారు అనేదానిపై మాత్రం దానం నాగేందర్ క్లారిటీ ఇవ్వలేదు.
