తెలంగాణ
Danam Nagender: ఆందోళనలో దానం నాగేందర్.. ఖైరతాబాద్ టికెట్ ఎవరికి?..
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే పార్టీ ఫిరాయించి అనర్హత వేటుతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన ఆయనకు కాంగ్రెస్ నుండి ఊహించని షాక్ తగిలినట్టు ప్రచారం మొదలైంది. పార్టీ మరోసారి టికెట్ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రోహిన్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనున్నట్టు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.
