ఏపీ

విశాఖను ఘోరంగా వణికిస్తున్న అర్నబ్ తుపాను..

ఏపీని అర్నబ్ తుపాను గజగజ వణకిస్తోంది. తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలలు సైతం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి జోరుగా వర్షం కురవడంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో వాతావరణం గందరగోళంగా మారింది. ఈదురుగాలుల ధాటికి ఎక్కడికక్కడ చెట్లు కూలుతున్నాయి. విశాఖపట్నంలోని అంగడి దిబ్బలో ఓ ఇంటిపై వృక్షాలు కూలాయి. దీనికి తోడు ఆంధ్రా యూనివర్సిటీలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడినట్టు తెలిసింది.తుపాను నేపథ్యంలో విశాఖలోని పర్యాటక ప్రాంతాలన్నింటనీ ముందుగానే అధికారులు మూసివేశారు. అదే విధంగా ఆంధ్రా యూనివర్సిటీకి 10 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు కూడా రెండు రోజులు సెలవు ఇచ్చారు.