తెలంగాణ

CyberSafetyForChildren: పిల్లల ఆన్‌లైన్ భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు!

 నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవ జీవితాలను ఎంతో సులభతరం చేస్తున్నప్పటికీ, అదే ఇంటర్నెట్ వలయంలో అమాయకులైన పిల్లలు చిక్కుకుని సైబర్ నేరగాళ్ల బారినపడే ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నిరుపేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించి, న్యాయాన్ని ఒక ఆయుధంగా మలిచిన మహాత్మా గాంధీ స్ఫూర్తితో న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన కొనియాడారు.